బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం

Wed,May 8, 2019 02:05 AM

కరీంనగర్ కల్చరల్: విశ్వగురువు బసవేశ్వరుడి బోధనలు సదా అనుసరణీయమనీ, ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలోని బాగేవాడిలో 1134 సంవత్సరంలో జన్మించిన బసవేశ్వరుడు సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించారని పేర్కొన్నారు. లింగాయత ధర్మం స్థాపించిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. మనుషులందరూ ఒక్కటే, కులాలు ఉపకులాలు లేవని చాటిన బసవేశ్వరుడు సదా స్మరణీయుడని తెలిపారు. కార్ల్‌మార్క్స్ కన్నా ముందే సమానత్వం, సోషలిజం కోసం పోరాటం చేసిన బసవేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భిక్షానాయక్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి రంగారెడ్డి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వ్యవసాయధికారి వీ శ్రీధర్, ఉద్యానవన శాఖాధికారి శ్రీనివాస్, సమాచార శాఖ ఉప సంచాలకుడు పీ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పీ రాజ్‌కుమార్, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles