మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

Wed,May 8, 2019 02:04 AM

వీణవంక: మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో మంగళవారం ఉదయం పెద్ది సునీత(45) మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామానికి చెందిన పెద్ది సునీత కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. సోమవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కావడంతో హైదరాబాద్ నుంచి జీల్గులకు వచ్చింది. సాయంత్రం తల్లిగారి ఊరు వీణవంక మండలం శ్రీరాములపేటకు వచ్చింది. రాత్రి కుటుంబసభ్యులంతా కలిసి ఇంటి ఆరుబయట నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలోని పుస్తెల తాడు (2 తులాలు) గట్టిగా లాగడంతో బిగ్గరగా అరిచింది. అప్పటికే మెడలోని పుస్తెల తాడు తెగగా పట్టుకొని పారిపోయాడు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

65
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles