కాళేశ్వరం పరుగులు

Thu,April 25, 2019 03:35 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. గోదావరి జలాలను వచ్చే వానాకాలంకల్లా తెలంగాణలోని చెరువులు కుంటలకు తరలించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నందిమేడారం టన్నెల్‌లోని పంప్‌హౌస్ మొదటి మోటర్ వెట్న్ విజయవంతమై, మేడారం రిజర్వాయర్‌కు నీరు చేరింది.

గోదావరి నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు శ్రీకారం చుట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా నాలుగేళ్ల కింద ప్రాజెక్టు ప్రారంభించి, కాలంతోపాటే పరుగులు పెట్టించారు. గోదావరిపై కాళేశ్వరం వద్ద మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎల్లంపల్లి మీదుగా వివిధ మార్గాల ద్వారా 90రోజులపాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి రాష్ట్రంలోని 18లక్షల ఎకరాలకు అందించడమే లక్ష్యంగా పనులు శరవేగంగా చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి జలాశయం నుంచి ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేందుకు లింక్-2లో ఆరో ప్యాకేజీ కింద పనులు చేపట్టారు. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి 1.1 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ, ఆ తర్వాత 9.590కిలోమీటర్ల చొప్పున రెండు జంట సొరంగాలు, నందిమేడారం భూగర్భంలో భారీ పంప్‌హౌస్, సర్జ్‌పూల్, అందులో ఏడు భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికే నాలుగు మోటర్లు డ్రైరన్ పూర్తి చేసుకోగా, మిగతావి పూర్తికావస్తున్నాయి. బుధవారం తొలి మోటర్ ద్వారా నీటిని విజయవంతంగా ఎత్తిపోశారు.

ఈ నెల 17 నుంచే పనులు..
ఎల్లంపల్లి జలాలను మేడారం రిజర్వాయర్‌కు తరలించడంలో భాగంగా కీలక నందిమేడారం పంప్‌హౌస్‌లో మోటర్లను సిద్ధం చేసేందుకు అధికారులు పదిరోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 17న ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌ను వేంనూర్ పంప్‌హస్ ద్వారా విడుదల చేశారు. అవి గ్రావిటీ కాలువ, ఆ తర్వాత సొరంగాల ద్వారా విజయవంతంగా మేడారం టన్నెల్‌లోని సర్జ్‌పూల్‌కు చేరాయి. ఈ క్రమంలో సర్జ్‌పూల్‌ను దశలవారీగా నింపిన అధికారులు, మూడు రోజులపాటు కసరత్తు చేసి ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేవని నిర్ధారించారు. ఈఎన్‌సీ వేంకటేశ్వర్లు, లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి టన్నెల్‌లోనే మకాం వేసి తొలి మోటర్ వెట్న్‌క్రు సర్వం సిద్ధం చేశారు.

వెట్న్ గ్రాండ్ సక్సెస్..
నంది మేడారంలో పంప్‌హౌస్‌లో తొలి మోటర్ వెట్న్ విజయంతమైంది. బుధవారం సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నుంచి విచ్చేయగా, ఇక్కడ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సీఎం ప్రత్యేక కార్యదర్శి ఉదయం 11.15 గంటలకు మేడారం టన్నెల్‌కు చేరుకున్నారు. అనంతరం 15 నిమిషాల పాటు పంప్‌హౌస్‌తోపాటు మోటార్లను పరిశీలించి, పూజలు చేశారు. అనంతరం 12.03 గంటలకు కంప్యూటర్ ద్వారా 127.6 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మొదటి మోటర్ వెట్న్ లాంఛనంగా ప్రారంభించగా, మొదలైన కొద్దిసేపటికే 200 ఆర్‌పీఎం(రిజల్యూషన్ ఫర్ మినిట్) స్పీడ్‌తో నందిమేడారం సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తి పోసే ప్రక్రియ ప్రారంభమైంది. టన్నెల్ ఉపరితలం వద్ద ఉన్న డెలివరీ సిస్టర్న్ నుంచి నీరు ఉప్పొంగింది. 550 మీటర్ల పొడవుతో నిర్మించిన లీడ్ చానల్ గుండా నంది మేడారం రిజర్వాయర్‌లోకి చేరింది. కాగా, టన్నెల్‌లో స్విచ్ ఆన్‌చేసిన స్మితా సబర్వాల్ అధికారులతో కలిసి 12.30 గంటలవరకు డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకొని కాళేశ్వర గంగకు ప్రత్యేక పూజలు చేశారు.

ఆనందంలో ఇంజనీర్లు..
తొలి మోటర్ విజయవంతంకావడంతో నీటి పారుదల శాఖ ఇంజినీర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఇంజినీర్లు అంతా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తమ కష్టానికి ఫలితం దక్కిందని సంతోషపడ్డారు. వెట్న్ విజయవంతంకావడంతో అండర్ టన్నెల్ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది.

కష్టానికి ఫలితం దక్కింది:
- సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక చరిత్ర అనీ, వేలాది మంది ఇంజినీర్లు, కూలీలు పగలనకా.. రాత్రనకా పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అభివర్ణించారు. నంది మేడారం పంప్‌హౌస్, డెలివరీ సిస్టర్న్ దగ్గర ప్రత్యేక పూజల చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది తెలంగాణ ప్రజల కోసం కట్టిన ప్రాజెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కష్టాలను మొదటి నుంచి చూసిన వాళ్లు మీడియా వాళ్లే కావున మీడియా మిత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పాజిటివ్‌గా వార్తలు రావాలని కోరారు.
సంతోషంగా ఉంది..
- నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ నీటి పారుదల శాఖ

నంది మేడారంలో మొదటి మోటర్ విజయవంతంగా వెట్న్ పూర్తిచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వం, నిర్దేశించిన సమయం ప్రకారం పని చేస్తున్నం. 10 రోజులు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసి వెట్న్‌న్రు విజయవంతం చేశాం. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. నంది మేడారంలో ప్రస్తుతం ఏడు పంపుల్లో మరో మూడు పంపులు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం జలాలను రైతాంగానికి అందించేందుకు చర్యలు తీసుకున్నాం. త్వరలోనే ప్యాకేజీ -6 నుంచి ప్యాకేజీ-7 దాకా పనులు పూర్తి చేసి మే నెలలో లేదా జూన్ మొదటి వారంలో ప్యాకేజీ 7కు నీటిని ట్రయల్ రన్ చేస్తాం.
15రోజుల్లో లక్ష్మీపూర్ బాహుబలికి వెట్న్.్ర.
- పెంటారెడ్డి, ఎత్తిపోతల సలహాదారు

ముఖ్యమంత్రి ఆశీస్సులతో మేడారంలో చిన్న బాహుబలిగా భావించే మొదటి మోటర్‌ను వెట్న్ విజయవంతంగా నిర్వహించాం. మరో 15రోజుల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ ప్యాకేజీ పనులు పూర్తి చేసి, పెద్ద బహుబలి మోటర్‌ను వెట్న్ చేసి నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే వానాకాలం నాటికి రైతులకు కాళేశ్వరం నీటిని అందిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే పనులు వేగంగా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తాం.

121
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles