భవన నిర్మాణానికి 18 కోట్లు

Thu,April 25, 2019 03:33 AM

కరీంనగర్ హెల్త్: స్మార్ట్ సిటీలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బ్లాక్ నిర్మాణానికి 18కోట్లు మంజూరయ్యాయి. బుధవారం స్మార్ట్ సిటీ మేనేజర్ రాజశేఖరం తన బృందంతో దవాఖానలోని స్థలాన్ని పరిశీలించారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం వెనుకభాగాన ఉన్న ఖాళీ స్థలంలో ఐదంతస్తుల భవనం నిర్మించేందుకు అనుకూలంగా ఉందని గుర్తించారు. ఇందుకు ఆర్‌వీ కన్సల్టెన్సీ అనుమతులు ఉన్నాయననీ, త్వరలోనే 45వేల స్కై్వర్‌ఫీట్స్‌తో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, ఏవో నజీముల్లాఖాన్‌తో కలిసి మ్యాప్‌ను పరిశీలించారు. ఈ నిర్మాణం ఆరు నెలల్లోపే పూర్తవుతుందనీ, దీంతో ప్రజలకు సౌకర్యాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

117
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles