ఎములాడ జనసంద్రం..

Tue,April 23, 2019 02:40 AM

వేములవాడ కల్చరల్ : వేసవి సెలవుల సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాముననే భక్తులు స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేశారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, రాజేశం, గోలి శ్రీనివాస్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, భూపతిరెడ్డి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణకట్టలో తమపిల్లలకు ఎంతో భక్తిశ్రద్ధలతో తలనీలాలను సమర్పించుకున్నారు. రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో శీఘ్రధర్మనం, ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం కోసం క్యూలైన్ల మీదుగా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కళాభవన్‌లో భక్తులు కల్యాణాల మొక్కులు తీర్చుకున్నారు. రాజన్నను దాదాపు 25 వేలకు పైగా మంది దర్శించుకున్నారనీ, రాజన్నకు సుమారు రూ.23 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అనుబంధ ఆలయాలైన శ్రీ బద్దిపోశమ్మ, నగరేశ్వరాలయం, శ్రీభీమేశ్వరాలయాల వద్ద కూడా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం బారులుతీరి నిలబడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వేములవాడ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో గట్టిపోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

126
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles