కౌన్సిలర్‌పై దాడి చేసిన నలుగురి అరెస్ట్

Sun,April 21, 2019 01:13 AM

జగిత్యాల క్రైం:జగిత్యా ల మున్సిపల్ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన న లుగురిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ ప్రకాశ్ తెలిపారు. జగిత్యాల 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్‌పై 16న ముఖేశ్ తన అనుచరులతో కలిసి కత్తులతో దాడిచేసిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ప్రకాశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ముఖేశ్ ఖన్నా గతంలో ఎన్‌ఎస్‌యూఐ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశాడు. కొంతకాలం క్రితం ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేశ్‌ను కాం గ్రెస్ పార్టీ బహిష్కరించింది. దీనిలో కౌన్సిలర్ శ్రీనివాస్ ప్రమేయం ఉందనీ, ముఖేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ప్రత్నిస్తుండగా, శ్రీనివాస్ అడ్డుపడుతున్నాడనే కారణంతో కోపం పెంచుకున్నాడు. ముఖేశ్ తన అనుచరులు రవి, మధు, రాజేందర్‌తో 16న రాత్రి కౌన్సిలర్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశారని సీఐ ప్రకాశ్ తెలిపారు. తన అనుచరులను ఫోన్ ద్వారా ముఖేశ్ బెదిరిస్తున్నాడని కౌన్సిలర్ శ్రీనివాస్ ఇటీవలే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని సీఐ తెలిపారు. టౌన్ ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి ఉన్నారు.

202
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles