సమ్మర్ క్యాంపులకు వేళాయే!

Sun,April 21, 2019 01:13 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కన్నారం ముచ్చటగా మూడోసారి సమ్మర్ క్యాంపునకు వేదిక కానుంది. ఈ మేరకు మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారులు, పెటా సంఘా ల బాధ్యులు, కోచ్‌లు, ఇతర అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించి శిబిరాల తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 20 నుంచి 29 వరకు అంబేద్కర్ స్టేడియంతో పాటు, కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ దరఖాస్తుల స్వీకరిస్తారు. కరీంనగర్ నగర పాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా విజయవంతంగా వేసవి క్రీడా శిబిరాలను నిర్వహి స్తున్నారు. శిక్షణతో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో ఏఫ్రిల్ 29 నుంచి మే 31 వరకు అంబేద్కర్‌స్టేడియంతో పాటు మానేరు తీరంలో సమ్మర్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. సుమారు 25 క్రీడాంశాల్లో 3వేల మంది విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అంబేద్కర్ స్టేడియంతో పాటు నగరపాలక సంస్థ కార్యాలయం లో ఈనెల 20 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని 4వ తరగతి నుంచి 10 చదివే విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్ చదివే వారు ఎక్కువగా దరఖాస్తులు చేసుకుంటే వారికి సైతం శిక్షణలు ఇచ్చేందు కు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవి శిక్షణలు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు. దరఖాస్తులకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదు. పోషకులు తమ పిల్లలకు ఏ ఆట అంటే ఇష్టమో తెలుసుకొని దానిలో శిక్షణలు ఇప్పిస్తే మెరుగ్గా రాణిస్తారన్నారు.

శిక్షణ ఇచ్చే క్రీడలు...
రెజ్లింగ్, జూడో, జిమ్మాస్టిక్, షటిల్ బాట్మింటన్, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, త్రో బాల్, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, అర్చరీ, యోగా, తైక్వాండో, ఉషు, కరాటే, వాటర్ స్పోర్ట్స్, స్కేటింగ్ తదితర క్రీడాంశాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ కొనసాగనున్నది.

92
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles