నేత్రపర్వంగా హనుమాన్ శోభాయాత్ర

Sat,April 20, 2019 12:51 AM

కరీంనగర్ కల్చరల్: జై శ్రీరాం... జై హనుమాన్ అంటూ మార్మోగే నినాదాలు.. రెపరెపలాడే కాషాయ జెండాల మధ్య బజరంగదళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ శోభాయాత్ర (మోటర్ సైకిల్ ర్యాలీ) నేత్రపర్వంగా జరిగింది. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ డివిజన్‌ల నుంచి బజరంగదళ్ కార్యకర్తలు, యువకులు కాషాయ జెండాలను పట్టుకొని బైక్‌లపై సర్కస్‌గ్రౌండ్‌కు చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా పీ మునీశ్రీ నీలచంద్రజీ మహరాజ్, విశ్వహిందూ పరిషత్ ఐదు రాష్ర్టాల సంఘటన కార్యదర్శి కేశవ్‌హెగ్డె హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా తయారు కావాలన్నారు. దుష్ట శక్తులు పెట్రేగిపోకుండా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ అన్ని పండుగలు కలసిమెలసి సమానంగా జరుపుకుంటామన్నారు. హనుమాన్ ఉత్సవ విగ్రహానికి పూజలు చేసిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్ర.. సర్కస్‌గ్రౌండ్ నుంచి ఐబీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీచౌక్, రాజీవ్‌చౌక్ నుంచి టవర్‌సర్కిల్, కమాన్ నుంచి బస్టాండ్ గుండా సర్కస్‌గ్రౌండ్‌కు చేరుకున్నది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు చేశారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఇనుగంటి మధుసూదన్‌రావు, జిల్లా కార్యదర్శి వుట్కూరి రాధాకృష్ణారెడ్డి, బజరంగ్‌దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్‌కుమార్, వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుస్సా శ్రీనివాస్, కోశాధికారి పాత కాశీనాథం, శ్రీహరి, బొమ్మకంటి కిషన్, పొన్నం శ్రావణ్, బజరంగ్‌దళ్ జిల్లా కోకన్వీనర్ తోట రాజేందర్, గుజ్జేటి రాజేందర్, నవనీతరావు, భగవాన్‌రావు, విఠలాచారి, శ్రీనివాస్, అర్జున్, బీజేపీ నాయకురాలు పీ సుజాతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles