న్యాయం చేయండి

Fri,April 19, 2019 02:56 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నా భర్త మల్లోజుల వెంకటయ్య దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిండు. అందుకు గుర్తింపుగా 1988లో అప్పటి ప్రభుత్వం పాత రామగుండం మండలం, ప్రస్తుత అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో 126 సర్వే నంబరులో ఎనిమిదెకరాల భూమి ఇచ్చింది. కానీ 2005 ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూమి పోయింది. ముంపు ప్రాంత నిర్వాసితులందరికీ పరిహారం ఇచ్చిన రెవెన్యూ అధికారులు నాకు మాత్రం ఇయ్యలేదు. ఎన్నిసార్లు అడిగినా ఇగిస్తాం.. అగిస్తాం.. అని చెబుతున్నరే కానీ పనిమాత్రం చేయడంలేదు. అలాగే పెద్దపల్లి మండలం బంధంపల్లిల సర్వేనంబర్ 67లో ఉన్న సొంత భూమి 35 గుంటలకూ పట్టా బుక్కు ఇస్తలేరు. అప్పట్లో నా భర్త తండ్రి పేరు తప్పుగా ఉంటే మొన్నటి ప్రక్షాళనల మార్చిన్రు కానీ, విరాసత్ చేస్తలేరు పట్టాబుక్కు ఇస్తలేరనిపెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ చెబుతున్నది. గురువారం తన మనువడు మల్లోజుల దిలీప్ శర్మతో కలిసి పెద్దపల్లిలో విలేకరుల సమావేశం పెట్టి, మాట్లాడింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, పెద్దకొడుకోలే అందరి బాగోగులు చూసుకుంటున్న సీఎం కేసీఆర్, తనకూ కొడుకోలే న్యాయం చేయాలని కోరుతున్నది. ప్రాజెక్ట్‌లో కోల్పోయిన భూమికి బదులుగా భూమైనా ఇవ్వాలనీ, లేదంటే పరిహారమైనా ఇవ్వాలంటున్నది. బంధంపల్లిలోని భూమికీ పట్టా బుక్కు ఇప్పించాలని కోరుతున్నది.

135
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles