విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Thu,April 18, 2019 01:15 AM

టవర్‌సర్కిల్: శాతవాహన విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా వార్షికోత్సవం ఏర్పాటు చేయడం అభినందనీయమనీ, విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ టీ చిరంజీవులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ శాతవాహన వర్సిటీలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సంబురాల్లో వీసీతో పాటు హైయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, అర్జున అవార్డీ అనూప్‌కుమార్, సినీ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్, ఎస్‌యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్‌తో కలిసి, పాల్గొన్నారు. చిరంజీవులు మాట్లాడుతూ, విద్యార్థులు యూనివర్సిటీ విద్యతోనే ఉన్నతమైన స్థానం సంపాదించాలన్నారు. ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ, యూనివర్సిటీలో ర్యాంకులు సాధించడంలో విద్యార్థులు విఫలమవుతుండడం బాధాకరమన్నారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, వర్సిటీలో చదువుకోవడం అదృష్టమన్నారు. రిజిస్ట్రార్ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌యూను రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ సరసిజ, మనోహర్, ఎం. వరప్రసాద్, లెక్చరర్లు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles