టీఆర్‌ఎస్‌లో వంద మంది చేరిక

Thu,April 18, 2019 01:15 AM

సైదాపూర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని వెన్కేపల్లి ఉపసర్పంచ్ కొత్త మధుసూదన్‌రెడ్డితో పాటు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు సుమారు వంద మంది హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలంలో జడ్పీటీసీతోపాటు వంద శాతం ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉన్నదని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో రాజు, లక్ష్మి, శేఖర్, సమత, ఆంజనేయులు, శ్రీనివాస్, కుమారస్వామి, స్వరూప, ఉమాదేవి, తిరుపతి, సంపత్, రవి, తిరుపతితో పాటు కార్యకర్తలు ఉన్నారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచ్ కొండ గణేశ్, వావిలాల ఖాదీబోర్డు డైరెక్టర్ పేరాల గోపాలరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రవీందర్, నాయకులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles