రూ. 25 కోట్లతో అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి

Wed,April 17, 2019 12:45 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: స్మార్ట్‌సిటీలో భా గంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియాన్ని రూ. 25 కోట్లతో అభివృద్ధ్ది చేయనున్నట్లు బల్దియా మే యర్ రవీందర్‌సింగ్, కమిషనర్ సత్యనారాయ ణ ప్రకటించారు. మంగళవారం బల్దియా సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంపుపై బల్దియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి జూన్ 30 వరకు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు ఈనెల 20 నుంచి 25 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 25 క్రీడా రంగాల్లో అత్యుత్తమ కోర్సుల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. శిక్షణ పొందే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. క్యాంపులో పాల్గొ నే విద్యార్థిని, విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించడంతో పాటు శారీరక ధారుఢ్యం పెంపుపై దృష్టి పెడతామన్నారు. అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ పనులకు సాధ్యమైనంత తొందరలో శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. సమావేశం లో అసిస్టెంట్ కమిషనర్ రాజేంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్, క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.

99
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles