పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

Tue,April 16, 2019 02:29 AM

- 12 కేంద్రాలు.. 5441 మంది విద్యార్థులు
ముకరంపుర : ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి ఆధ్వర్యంలో నేడు నిర్వహించే పాలిసెట్‌కు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం మొత్తం 12 కేంద్రాలను ఎంపిక చేయగా, వీటిలో 5441 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగుతుందనీ, ఒక నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించమని తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో హాజరుకావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలైన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, తిమ్మాపూర్‌లోని మోడల్ స్కూల్, సప్తగిరికాలనీలోని ప్రభుత్వ పాఠశాల, నగరంలోని సైన్స్‌వింగ్, జూనియర్ కళాశాల, పారామెడికల్ కాలేజ్, అల్గునూర్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్ సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల (మూడు కేంద్రాలు), జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles