కన్నులపండువగా కల్యాణం

Mon,April 15, 2019 12:54 AM

-పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పణ
-తిలకించి, పులకించిన భక్తజనం
-కిక్కిరిసిన ఆలయాలు
-భక్తులకు అన్నదానం
-పలుచోట్ల పాల్గొన్న ఎంపీ వినోద్‌కుమార్, మేయర్, కార్పొరేటర్లు
కరీంనగర్ కల్చరల్: నగరంలోని ఆలయాల్లో ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు హాజరై కల్యాణం తిలకించి, అర్చకుల దీవెనలు అందుకున్నారు. చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో అర్చకులు కొరిడె శ్రీధరశర్మ, శ్రీనివాసశర్మ, వంశీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. నిర్వాహకుడు బండి సంజయ్‌కుమార్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వావిలాలపల్లి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వినాయకశర్మ, నర్సింహాచార్యులు కల్యాణాన్ని జరిపించారు. కార్పొరేటర్ బండారి వేణు, వనిత దంపతులు, జువ్వాడి వినాయకరావు మధులిత దంపతులు, వావిలాలయూత్ సభ్యులు పాల్గొన్నారు.

30వ డివిజన్ రామచంద్రాపూర్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీవేణు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అర్చకుడు మురళీధర్‌శర్మ జరిపించారు. ఈ వేడుకల్లో ఎంపీ వినోద్‌కుమార్ మాధవి దంపతులు, సీఐ తులశ్రీనివాస్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకులు సాదవేని శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాంనగర్‌లోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకల్లో కార్పొరేటర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్ దంపతులు పాల్గొని, స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అర్చకులు ప్రవీణ్‌కుమార్, అనిల్‌కుమార్ వేడుకలను నిర్వహించారు. ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ డైరెక్టర్లు, గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్, చైర్మన్ చల్లా హరిక్రిష్ణ, భక్తులు పాల్గొన్నారు. కమాన్‌చౌరస్తాలోని పోతులూరి వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి దేవాలయంలో..
మార్కెట్‌రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చెన్నోజ్వల నాగరాజు, లక్ష్మీనారాయణాచార్యులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ చకిలం ఆగయ్య, ఈవో కిషన్‌రావు దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. సప్తగిరి కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు రామాచార్య, కపి వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ తంతు జరిపించారు. రెడ్డి సంఘం బాధ్యులు మజ్జిగ పంపిణీ చేశారు. కార్పొరేటర్ కవితాబుచ్చిరెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి, ఆలయ బాధ్యులు గౌతంరావు, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీను, భక్తులు పాల్గొన్నారు. గోదాంగడ్డలోని అంజనాద్రి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు మహేశ్వర్‌శర్మ, రామకృష్ణశర్మ కల్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్పొరేటర్లు వై. సునీల్‌రావు అపర్ణ, ఏవీ రమణ, భక్తులు పాల్గొన్నారు. భగత్‌నగర్ అయ్యప్ప ఆలయంలో మంగళంపల్లి రాజేశ్వరశర్మ, శ్రీనివాసశర్మ కల్యాణాన్ని జరిపించారు.

కార్పొరేటర్ వై అపర్ణ, సునీల్‌రావు పట్టు వస్ర్తాలు సమర్పించారు. కర్ర రాజశేఖర్, శ్రీనివాస్‌గౌడ్ దంపతులు, ఆలయ బాధ్యులు పాల్గొన్నారు. కశ్మీర్‌గడ్డలోని కపీశ్వర దేవాలయంలో కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్పొరేటర్ వై. సునీల్‌రావు అపర్ణ, భక్తులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితులు సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. కార్పొరేటర్ వై. సునీల్‌రావు అపర్ణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. శ్రీ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, భక్తులు పాల్గొన్నారు. మంకమ్మతోటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాలనీవాసులు పాల్గొన్నారు. చల్లా స్వరూపారాణి హరిశంకర్, పెద్దపల్లి రవీందర్, మల్లికార్జున రాజేందర్, ఎం.శ్రీనివాస్, జితేందర్, భక్తులు పాల్గొన్నారు. సాయినగర్ విజయ సాయిగణపతి దేవాలయంలో ఆలయ అర్చకులు సాయిశర్మ, నర్సింహశర్మ, గంగాధర్‌శర్మ కల్యాణోత్సవం నిర్వహించారు. వ్యవస్థాపక చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య, ధర్మకర్తలు నలువాల ప్రకాశ్‌పటేల్, అయిందాల లక్ష్మయ్య, ఈవో మారుతి, పిట్టల అంజయ్య, డాక్టర్ ప్రదీప్‌కుమార్, డాక్టర్ కంచన్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

గిద్దెపెరుమాండ్ల ఆలయంలో..
గిద్దెపెరుమాండ్ల దేవస్థానంలో వేద పండితుడు పురాణం మహేశ్వరశర్మ నేతృత్వంలో రామక శంకరశర్మ కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఇందులో ఆలయ చైర్మన్ గణగోని సత్యనారాయణ, కార్పొరేటర్ నలువాల రవీందర్, లెక్కల వేణుగోపాల్, గొంటి సుధాకర్, మల్లేశం, బొల్లవేణి శ్రీనివాస్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక వావిలాలపల్లెలోని శ్రీ సీతారామచంద్రాస్వామి దేవాలయంలో వేద పండితులు కల్యాణ వేడుకలను నిర్వహించారు. కార్పొరేటర్ లంక రవీందర్ పట్టు వస్ర్తాలు సమర్పించారు. గౌరవ అధ్యక్షుడు మేచినేని అశోక్‌రావు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చైర్మన్ మేచినేని నారాయణరావు, సనత్‌కుమార్, అశోక్‌రావు, వెంకట్‌రావు, డాక్టర్ సంజీవరావు, వెంకటేశ్వర్‌రావు, నీలిమా, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి దంపతులు, సీఐ విజయ్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు. జ్యోతినగర్‌లోని శ్రీ హనుమాన్ సంతోషిమాత దేవాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిపించారు. సంతోషినగర్ సంతోషిమాత ఆలయంలో సాగర్‌రావు, కొండాల్‌రెడ్డి, నీలిమా, నారాయణరావు పాల్గొన్నారు. గాంధీరోడ్ రామాలయంలో అర్చకులు వైభవంగా కల్యాణాన్ని జరిపించారు.

ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధీరోడ్, వాయుపుత్ర యువజన సంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనగర్‌కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేదపండితులు ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ వేడుకల్లో కార్పొరేటర్ కట్ల విద్యసతీశ్, తదితరులు పాల్గొన్నారు. బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞవరాహక్షేత్రంలో సర్వవైదిక సంస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించారు. సంస్థానం కులపతి శ్రీ భాష్యం విజయసారథి, ఉప కులపతి శ్రీభాష్యం వరప్రసాద్‌దంపతులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కొత్తయాస్వాడ అభయాంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

అలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ర్యాకం సుధాకర్‌పటేల్, ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు తోట సునీల్‌పటేల్, కోశాధికారి బూరుగుపల్లి రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ పేర్కొంది. గణేశ్‌నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీప్రసన్నాంజనేయ దేవాలయ కమిటీ, గణేశ్‌నగర్ సేవా సమితి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. మాడ రాజిరెడ్డి, మల్లికార్జున వెంకటరామారావు, కొలిపాక అంజయ్య, జనార్దన్‌రెడ్డి, తోట రామయ్య, బండ సత్తయ్య, చల్లా మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.స్థానిక రామచంద్రపురి కాలనీ దేవుళ్లపురిలోని పంచముఖ హనుమదీశ్వరాలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాల రాంరెడ్డి, విజయలక్ష్మీ దంపతులు సుమారు వెయ్యి మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles