ఆదర్శనీయుడు అంబేద్కర్

Mon,April 15, 2019 12:52 AM

-ఆయన ముందుచూపుతోనే తెలంగాణ రాష్ట్రం
-రిజర్వేషన్ ఫలాలతో పేదల జీవితాల్లో వెలుగు
-128వ జయంతి కార్యక్రమంలో మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కుమార్
-రాజ్యాంగ నిర్మాతకు నివాళి అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
టవర్‌సర్కిల్: అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకే కాక అందరికీ ఆదర్శనీయుడనీ, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద నిర్వహించిన అంబేద్కర్ 128వ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టినా అంబేద్కర్ కష్టపడి చదివి భారత రాజ్యాంగం రాయగలిగే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయనకు దూరదృష్టి ఎక్కువనీ, దేశంలోని దళిత, బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధి సాధించాలంటే రిజర్వేషన్‌లు ముఖ్యమని గ్రహించి వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తుచేశారు. అలాగే చిన్న రాష్ర్టాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని ముందుగానే గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారా ఇందుకు అవకాశం కల్పించారని తెలిపారు. దీనిద్వారానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోగలిగామని చెప్పారు. ఆయన అందించిన రిజర్వేషన్ ఫలాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జేసీ శ్యాం ప్రసాద్‌లాల్, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, డీఆర్వో బిక్షానాయక్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, లంక రవీందర్, సునీల్‌రావు, బండి సంజయ్, దళిత సంఘాల నాయకులు మేడి మహేశ్, మాదరి శ్రీనివాస్, కామారపు శ్యాం తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles