కల్యాణం.. కమనీయం

Mon,April 15, 2019 12:51 AM

ఇల్లందకుంట: అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం ఆదివారం కన్నుల పండువలా సాగింది. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు వేడుకకు హాజరయ్యారు. సుమారు 80 వేల మంది భక్తులతో ఆలయం పోటెత్తగా, కల్యాణం జరుగుతున్నంత సేపు రామనామ స్మరణతో ప్రాంగణమంతా మార్మోగింది.

ఇల్లందకుంట మండలకేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఎదుర్కోళ్ల తర్వాత రామయ్యను పల్లకీలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా కల్యాణ వేదికకు తీసుకువచ్చారు. ఈసారి ఎన్నికల కోడ్ ఉన్నందున్న మంత్రి ఈటల రాజేందర్‌కు బదులు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ ఆహ్మద్, ఆర్డీఓ చెన్నయ్య, దేవాలయ ఈవో సుదర్శన్ పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి కలిసి పట్టువస్ర్తాలను అందించారు. కల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, సీతారామచార్యులు సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి వేడుకను తిలకించి పులకించారు. స్వామి వారికి తలంబ్రాలను సమర్పించేందుకు భక్తులు ఎగబడ్డారు.

సీతమ్మ మెడలో రాముడు తాళి కట్టే సన్నివేశాన్ని భక్తులు చూసి మురిసి పోయారు. భక్తులకు జమ్మికుంట రైస్‌మిల్లర్ల ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం నిర్వహించారు. దేవస్థాన కమిటీ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. కరీంగర్ పాల డెయిరీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. కల్యాణ వేడుకలో ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మంత్రి ఈటల సతీమణి జమునారెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, దేవాలయ ఈవో గుజ్జ సుదర్శన్, ఆర్డీఓ చెన్నయ్య, తహసీల్దార్లు నారాయణ, హరికృష్ణ, ఏసీపీ కృపాకర్, సీఐలు లింగయ్య, సృజన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐలు, పాల్గొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles