అలరించిన జాన్సన్ గ్లోబల్ వార్షిక వేడుక

Sun,April 14, 2019 01:54 AM

కరీంనగర్ కల్చరల్: నగరంలోని జాన్సన్ గ్లోబల్ హైస్కూల్ వార్షిక వేడుకలు శనివారం రాత్రి స్థానిక మాత మాణికేశ్వరి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరికీ కీలకమనీ, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, మంచి నడవడికతో కష్టపడి చదవాలని సూచించారు. దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో సత్తచాటి విజేతలుగా నిలిచిన విద్యార్థికి బహుమతి ప్రదానం చేసి, అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంసృ్కతిక కార్యక్రమాలు అహూతులను అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ శారదారెడ్డి అకాడమిక్ వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. డైరెక్టర్ సింహాచలం హరిక్రిష్ణ మాట్లాడుతూ, స్థాపించిన సంవత్సరం నుంచే తమ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో కార్పొరేట్ సంస్థలకు దీటుగా జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి అగ్రగామిగా నిలిచిందన్నారు. విద్యతోపాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని కొనియాడారు. డైరెక్టర్స్ మహిపాల్‌రెడ్డి, ఎంవీ వరప్రసాద్, సింహాచలం హరిక్రిష్ణ, కే రాంరెడ్డి, వంగల సంతోష్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పీ మురళీక్రిష్ణ. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

117
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles