పారమితలో ఆకట్టుకున్న పీబీఎల్ ప్రదర్శన

Sat,April 13, 2019 06:23 AM

ముకరంపుర: స్థానిక పద్మనగర్‌లోని పారమిత విద్యాసంస్థలు, ఐరిస్ ఎక్స్‌ప్లోరికా పాఠశాలల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్(పీబీఎల్) ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2018-19 విద్యా సంవత్సరాంతరం అన్ని పారమిత పాఠశాలల్లో ఏడు వందలపై చిలుకు ప్రాజెక్టులపై విద్యార్థులు ఏడాది మొత్తం పని చేస్తారని పాఠశాలల అధినేత డాక్టర్ ఈ ప్రసాద్‌రావు వివరించారు. శుక్రవారం పద్మనగర్‌లోని పారమిత ఐఐటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల పాఠశాలల స్థాయిలో జరిగిన పోటీల్లో ఏడు వందల ప్రాజెక్టుల నుంచి 60 ప్రాజెక్టులు చివరి పోటీకి ఎంపికయ్యాయని తెలిపారు. చివరిపోటీ పద్మనగర్‌లోని ఐఐటీ పారమిత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించామన్నారు. భవిష్యత్తులో దేశానికి ఉత్తమమైన నైపుణ్యాలు కలిగిన యువతను అందించే క్రమంలో వచ్చే ఏడాది కూడా ఈ పీబీఎల్‌ను విధిగా కొనసాగిస్తామని తెలిపారు. పీబీఎల్‌కు పుణేకు చెందిన జ్ఞాన ప్రబోధిని నీతి అయోగ్ కోసం కూడా పని చేస్తున్నదన్నారు. కాగా, ఈ ప్రదర్శనకు జ్ఞాన ప్రబోధినికి చెందిన పుణే బృందం ప్రశాంత్ దివేకర్, నచికేత్ నిట్సురే, మధుర లుంకాడ్, కళాయని పట్యర్థన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, అత్యుత్తమ ప్రాజెక్టు విజేతలను ప్రకటిస్తారని తెలిపారు. ప్రశాంత్ దివేకర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు బేస్ట్ లర్నింగ్ (పీబీఎల్) దేశంలో అతి కొద్ది పాఠశాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఇన్‌స్పైర్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉద్దేశం కూడా ఈ పీబీఎల్‌ను పూర్తి చేస్తుందన్నారు. ప్రదర్శనలో లేజర్‌లైట్, సెక్యూరిటీ, ట్రీ రీప్లాంటింగ్, గ్రీడినెస్, డిఫ్యూజన్ అండ్ ఫుడ్ కలరింగ్, రైస్ అండ్ ఇట్స్‌టైప్స్, ఐసెట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. పారమిత డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, అనుకర్‌రావు, వినోద్‌రావు, రాకేశ్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles