విలీనానికి సుప్రీం ఓకే..

Sat,April 13, 2019 06:23 AM

-హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
కరీంనగర్ రూరల్: నగర, మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలకు సుప్రీంకోర్టు సైతం ఒకే చెప్పింది. రాష్ట్రంలోని వివిధ నగరపాలక, మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే కరీంనగర్ నగరపాలక సంస్థలో పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, అల్గునూర్, సదాశివపల్లి గ్రామాలను వీలినం చేశారు. ఈ గ్రామాల విలీనంపై గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలు రాష్ట్ర హైకోర్టులో పిటిషిన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు మార్చి 8న గ్రామాల విలీనాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విలీన గ్రామాలకు చెందిన పలువురు మార్చి 20న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో నగరపాలక సంస్థలో గ్రామాల విలీనానికి పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది.

114
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles