ఓటింగ్ శాతం పెంచాలి

Thu,April 11, 2019 01:18 AM

హుజూరాబాద్ టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా పార్టీ నాయకులు కృషిచేయాలని కరీంనగర్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. పోలింగ్ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలనీ, ఎక్కువశాతం నమోదయ్యేలా చూడాలని కోరారు. బుధవారం సాయంత్రం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ నివాసంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఎంపీ కలిశారు. గురువారం జరిగే పార్లమెంట్ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్ గ్రామశాఖలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అన్ని బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లను నియమించాలని సూచించారు. కార్యకర్తలందరూ ఉదయం ఆరు గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో ఉండి, ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా సహకరించాలన్నారు.

ఎండలు ఎక్కువ ఉన్నందున ఉదయం 7-11గంటల లోపే అధిక పోలింగ్ శాతం జరిగేలా చూడాలన్నారు. పట్టణాలు, ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్న ఓటర్లను గుర్తించి,వారికి ఫోన్ చేయాలనీ, ఊరికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాల్సిందిగా అభ్యర్థించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేశామని చెప్పారు. ఇన్ని రోజులపాటు అందరూ తనకు అన్ని విధాలా సహకరించారనీ, ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అహర్నిశలు శ్రమించి ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ ధైర్యంగా ఉండాలనీ, 16సీట్లు మనమే గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు వడ్లూరి విజయ్‌కుమార్, మంద రమేశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, దొంత రమేశ్, చందా గాంధీ, చొల్లేటి కిషన్‌రెడ్డి, ముక్క రమేశ్, వీ కిషన్, ఎండీ ఇసాక్, బీఎస్ ఇమ్రాన్, శ్రీనివాస్, రమేశ్, సందీప్, కొలిపాక అజయ్, బాబు, ఎం. రమేశ్‌యాదవ్, తదితరులున్నారు.

శంకరపట్నంలో సమావేశం..
శంకరపట్నం: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషిచేయాలని ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన హన్మకొండ నుంచి కరీంనగర్‌కు వెళ్తూ మార్గ మధ్యలో శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో కార్యకర్తలను కలిశారు. జడ్పీటీసీ సంజీవరెడ్డితో మాట్లాడారు. కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కరీంపేట్ సర్పంచ్ వనపర్తి మల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులున్నారు.

122
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles