టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ రాష్ట్ర నేత

Thu,April 11, 2019 01:18 AM

రామడుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి క్యూ కడుతున్నారు. బుధవారం టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఖాసీం షరీఫ్ గంగాధరలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఖాసీంకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ కృషిని చూసే ప్రతిపక్ష పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిషలు పని చేస్తూ వారి ప్రగతికి పెద్దపీట వేయటంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఖాసీం షరీఫ్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా నిరుపేద మైనార్టీ యువతుల నిఖాలో మేనమామలా సీఎం కేసీఆర్ షాదీముబారక్ పథకం ద్వారా సహాయం అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. మసీదుల అభివృద్ధి కోసం రూ.కోట్ల నిధులు మంజూరు చేయడమే కాకుండా రంజాన్ పండుగ పర్వదినంలో పేద ముస్లింలకు కొత్తబట్టలు పెట్టి ఆతిథ్యం అందించడం హర్షనీయమన్నారు. నిస్వార్థ పరుడు, సౌమ్యుడైన మహమూద్ అలీకి ప్రభుత్వంలో కీలకమైన హోం మంత్రి పదవిని ఇచ్చి మైనార్టీలకు సముచితస్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మైనార్టీలకు పూర్తి గుర్తింపు కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.కార్యక్రమంలో గంగాధర ఎంపీపీ దూలం బాలగౌడ్, మాజీ ఎంపీపీ పడితపెల్లి కిషన్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పుల్కం నర్సన్న, తడగొండ నర్సింబాబు, తిర్మలాపూర్ టీఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పన్యాల మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

176
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles