కేసీఆర్‌తోనే మైనార్టీలకు న్యాయం

Wed,April 10, 2019 01:07 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కేసీఆర్ సర్కారుతోనే మైనార్టీలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్‌తో కలిసి మంగళవారం నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇంటింటా ప్రచారం చేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. మైనార్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ సౌకర్యాలతో కూడిన గురుకులాలను ప్రారంభించారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి షాదీముబారక్ కింద రూ. లక్ష రూపాయల సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధి కల్పన, ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. రైతుల మేలు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి ఈ ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి విశేష కృషి చేసిన వినోద్‌కుమార్‌ను మళ్లీ గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు యూసఫ్, ఫక్రోద్దీన్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక..
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మసూద్‌ఖాన్, తాజొద్దీన్ ఖాద్రి, అయూబ్‌ఖాన్‌తో పాటుగా 50 మంది హోం మంత్రి మహమూద్ అలీ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles