కేంద్రంలో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర

Sun,March 24, 2019 01:30 AM

సైదాపూర్: పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేననీ, అందులో టీఆర్‌ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు శ్రమించి రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను గెలిపించి మరోసారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ మంచి నాయకుడు అని, ఆయనకు సాగునీటి ప్రాజెక్టులు, సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నదని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్న ఎంపీ వినోద్‌కుమార్‌ను రానున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో 25న భారీ ర్యాలీ, రోడ్‌షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 26 గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే
మండలకేంద్రంలో నాయకులతో ప్రెస్‌మీట్ అనంతరం ర్యాలీ, రోడ్ షో నిర్వహణ కోసం ఎమ్మెల్యే మండల కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి బైక్‌మీద వెళ్లి వారిలో ఉత్సాహం నింపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చంద శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, సర్పంచ్ కొండ గణేశ్, ఏఎంసీ డైరెక్టర్ పోలు ప్రవీణ్‌తో పాటు మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles