ఎన్నికల నిబంధనలు పాటించాలి

Sat,March 23, 2019 01:45 AM

గంగాధర: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి సూచించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం గట్టుభూత్కూర్‌లో శుక్రవారం పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. గ్రామ కూడలిలో గ్రామస్తులకు ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో అనుమతి లేకుండా ప్రచారం, ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో బెల్టు షాపులు మూసి వేయాలనీ, అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేశ్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్, సర్పంచ్ కంకణాల విజేందర్‌రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వన్నారం గ్రామంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. కాగా ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతుగా స్థానిక యువకులు రూ. 15,736 సేకరించి ఏసీపీకి అందజేశారు. ఇక్కడ సీఐ రమేశ్, ఎస్‌ఐ రవి, సర్పంచ్ జాడి లక్ష్మి, ఎంపీటీసీ తౌటు సువర్ణ, మాజీ ఎంపీపీ మురళీ, తదితరులున్నారు.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles