కల్వకుంట్ల కవిత

Fri,March 22, 2019 01:32 AM

స్వగ్రామం : కరీంనగర్
పుట్టిన తేదీ : 13 మార్చి 1978
తల్లిదండ్రులు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శోభ
భర్త : దేవనపల్లి అనీల్
వివాహం : 2003
పిల్లలు : ఆదిత్య అనీల్, ఆర్యా అనీల్
విద్యార్హతలు : ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ (పాఠశాల : ఇంటర్ విద్య స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్ హైదరాబాద్. బీటెక్ : వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హైదరాబాద్. ఎమ్మెస్: సౌత్‌ఎర్న్ మిసిసిప్పి విశ్వవిద్యాలయం అమెరికా)
స్వదేశాగమనం : 2004
ప్రస్తుత హోదా : నిజామాబాద్ ఎంపీ

గౌరవాధ్యక్ష స్థానాలు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు (ఇటీవలే రాజీనామా). అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు. విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర తొలి కమిషనర్

లోక్‌సభలో బాధ్యతలు : లోక్‌సభ అంచనాల కమిటీ సభ్యురాలు. లోక్‌సభ వాణిజ్య కమిటీ సభ్యురాలు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీటి జాతీయ సంఘాల స్థాయి సభ్యురాలు. కామన్‌వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ ఇండియా రీజన్ ప్రతినిధి. ఉప రాష్ట్రపతి డెలిగేషన్ కమిటీ మెంబర్‌గా కంబోడియా. లావోస్‌లో ప్రాతినిధ్యం. లోక్‌సభ స్పీకర్ డెలిగేషన్ బృంద సభ్యురాలిగా బ్రెసెల్స్. బెల్జియం పార్లమెంట్‌ల సమ్మేళనంలో ప్రాతినిధ్యం.

ఉద్యమంలో పాత్ర
2004లో అమెరికా నుంచి తెలంగాణకు చేరుకున్న కవిత, 2006లో ఉద్యమంలోకి ప్రవేశించారు. 2006లో తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి, మన భాష, యాసల పరిరక్షణతోపాటు, మరుగునపడ్డ చరిత్ర, వారసత్వ సంపదను కాపాడేందుకు సన్నద్ధ్దమయ్యారు. జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 2007 నుంచి ఏటా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి, విశ్వవ్యాప్తం చేశారు. 8,500ల మంది మహిళలు, యువతులకు నైపుణ్య శిక్షణను ఇప్పించి, ఉపాధి చూపించారు. 3500 మంది గల్ఫ్ బాధితులను స్వదేశానికి రప్పించారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009 తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలోని పలు కీలక ఘట్టాల్లో కవిత ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సడక్ బంద్, రైలు రోకో, సాగర హారం, మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆమె, పలుసార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు.

ఎంపీగా చేరువ..
2014లో తన సొంత నియోజకవర్గం నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్‌పై 1,67,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా తనదైన శైలిలో ప్రజలతో మమేకమయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో అనేక విజయాలు సాధించారు. జగిత్యాల- ఇందూర్ రైల్వేలైన్‌ను పూర్తి చేయించడంతోపాటు, లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ను జగిత్యాల వరకు పొడగింపజేయడంలో విజయవంతమయ్యారు. ఆర్మూర్ రైల్వైలైన్ ఏర్పాటు, నిర్మల్ వరకు రైల్వేలైన్ పొడిగింపు తదితర అంశాలపై సైతం ఆమె బడ్జెట్‌ను సంపాదించగలిగారు. జగిత్యాలకు 4వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మంజూరు, బోర్నపెల్లి వంతెన, రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ, రాయికల్ డిగ్రీ కాలేజీ సాధన, సదర్మాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. మన ఊరు- మన ఎంపీ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఎన్నో సమస్యలకు పరిష్కారరం చూపగలిగారు. పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయించేందుకు విశేషంగా కృషి చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా గొప్ప రాజనీతిజ్ఞతను ఆమె ప్రదర్శించారు. పార్లమెంట్‌లో అత్యధికంగా హాజరు ఉన్న ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందడంతోటు, మహిళా సాధికారత, ఉగ్రవాదం, వ్యవసాయం, జమ్ముకాశ్మీర్ వ్యవహరం లాంటి కీలక అంశాలపై తాను చేసిన ప్రసంగాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఐదేళ్లలో ఆమె చూపిన ప్రతిభకు గాను, ఇండియా ఏసియా పోస్ట్ మ్యాగజైన్ నిర్వహించిన ఆదర్శ్ డివిజన్ నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు.

124
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles