పాత కక్షలతో పరస్పర దాడులు

Fri,March 22, 2019 01:31 AM

శంకరపట్నం: మండలంలోని కేశవపట్నానికి చెందిన ఇరు కుటుంబాలకు చెందిన వ్య క్తులు పాత కక్షలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లోని వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మ్యా కల ప్రభాకర్ కుటుంబంచ మాటూరి కనుకయ్య కుటుంబం గురువారం సాయంత్రం ఒకరిపై ఒకరు పాత కక్షలను మనుసులో ఉం చుకొని దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుపై ఇరు కుటుంబాలకు చెందిన మా టూరి కనుకయ్య, మాటూరి వెంకటేశ్, మా టూరి సారమ్మ, మాటూరి పల్లవితో పాటు మ్యాకల ప్రభాకర్, మ్యాకల లత, మ్యాకల వంశీక్రిష్ణ, మ్యాకల గణేశ్, మాతంగి పవన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఈ సంద ర్భంగా వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
రుద్రంగి: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నాయకుడు మాడిశెట్టి కృపాల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ మొత్తం 16 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంపీ వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండ ల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు బొడ్ల కిషోర్, చకినాల అర్జున్, నాలమాచు రాజు, బచ్చు రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles