గన్నేరువరం: మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన గొల్ల తిరుపతి (35) అనే యువ రైతు బు ధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతి చెందా డు. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతికి 13 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. దానికి తోడు తన సోదరుడికి సంబంధించిన 5 ఎకరాల భూ మిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా సరైన దిగుబడి రాక 5 ల క్షల అప్పుల్లో కూరుకుపోయినాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక బుధవారం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో క్రిమి సంహారక మందు తాగా డు. స్థానికులు అతనిని ఒక వాహనంలో ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం రాత్రి ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య కనుకమ్మ, కూతురు అక్షయ, కుమారుడు రాంచరణ్ ఉన్నారు. భార్య కనుకమ్మ ఫిర్యాదు వేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.