టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు

Thu,March 21, 2019 01:11 AM

జమ్మికుంట: కాంట్రాక్టు పనులు.. పైసలు సంపాదనలు మాకొద్దు. మా ధ్యాస.. మా శ్వాస ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం. ఉద్యమ బిడ్డలుగా ఆదరిస్తున్నరు. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ తన పాత్ర పోషించాలి. ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు. మీ అండతో 16సీట్లు సాధిస్తం. ఢిల్లీని శాసిస్తం. రాష్ర్టాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తాం. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ అర్బన్, మండలశాఖ అధ్యక్షులు రాజ్‌కుమార్, రమేశ్‌ల అధ్యక్షతన మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు పూర్ణకుంభంతో అర్చకులు, నాయకులు స్వాగతం పలికారు. ఎంపీ, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సన్మానించారు. కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. నాయకులకు పంపిణీ చేశారు. అభిమానులు ఎంపీ, మంత్రికి కత్తిని బహూకరించారు. తర్వాత మంత్రి మాట్లాడారు. ఉద్యమ నాయకుడు వినోదన్నను మరోసారి ఆశీర్వదించాలనీ, అండగుండి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెల 22 జమ్మికుంట అంబేద్కర్ చౌక్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభకు వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమం నుంచీ ఈ మండలం జిల్లాకు స్ఫూర్తినిస్తున్నదనీ, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆదర్శంగా నిలువాలన్నారు. రాబోయే తరాలకు సమస్యల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాణమున్నంత వరకూ సేవలందిస్తా: ఎంపీ వినోద్‌కుమార్
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలవాలని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేంద్రంతో నిత్యం కొట్లాడుతున్నామనీ, మన వాటా, హక్కులను సాధించుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే రూ.1400కోట్లతో మెడికల్ సైన్సెస్‌ను, 3వేల కిలో మీటర్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మీరు గర్వపడేలా పనిచేస్తున్నామనీ, ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇన్‌చార్జి సారయ్య, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్, లింగారావు, లక్ష్మణ్‌రావు, సంపత్‌రావు, విజయ భాస్కర్‌రెడ్డి, శ్యాం, మహిపాల్, కొమురయ్య, హరిబాబు, ఉమాదేవి, శారద, కొండాల్‌రెడ్డి, నారాయణ, కుమారస్వామి, మనోహర్‌రావు, మొగిలయ్య, మల్లయ్య, కోటి, సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles