కాళేశ్వరంలో మరో రికార్డు

Thu,March 21, 2019 01:11 AM

రామడుగు: తెలంగాణ రాష్ర్టాన్ని మరో కోనసీమలా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో విజయం చేకూరింది. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీలో బుధవారం రాత్రి 9.15 గంటలకు మూడో యూనిట్‌లోని ఐదో మోటార్ డ్రైరన్ విజయవంతమైంది. మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టాల్సిన డ్రైరన్ సాంకేతిక కారణాలతో సాయంత్రం చేపట్టారు. ఇప్పటికే నాలుగు మోటార్లలో డ్రైరన్ చేపట్టగా బుధవారం నిర్వహించిన ఐదో మోటార్ డ్రైరన్ కూడా విజయవంతం కావడంతో సంబంధిత అధికారులు, మెగా ఏజెన్సీ ప్ర తినిధులు సంబురాలు చేసుకున్నారు. సాగునీటి రంగంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన బాహుబలి మోటార్లుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక్కో మోటార్ సుమారు 139 మెగావాట్లతో లక్షా 86 వేల హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉం టుందనీ, బుధవారం నిర్వహించిన డ్రైరన్‌లో ఐదో మోటార్ 214 రివల్యూషన్ ఫర్ మినట్(ఆర్పీఎం) తిరిగినట్లు ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ వివరించారు. లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీలో బుధవారం వరకు ఐదు మోటార్లను డ్రైరన్ చేపట్టామనీ, మరో రెండు మోటార్ల డ్రైరన్‌ను సాధ్యమైనంత తొందర్లోనే చేపడుతామని ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు నీరందించేందుకు అనుకున్న సమయానికల్లా లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. ఎనిమిదో ప్యాకేజీలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయ ని పేర్కొన్నారు. లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీ డెలివరీ సిస్టమ్ నుంచి గ్రావిటీ కాలువ కూడా పూర్తయ్యిందని తెలిపారు. వరదకాలువ, గ్రావిటీ కెనాల్ జంక్షన్ పాయింట్ వద్ద రెగ్యులేటర్ పూర్తయిందన్నారు. జంక్షన్‌పాయింట్‌లో పనులు తుదిదశకు చేరాయని తెలిపారు. ఎనిమిదో ప్యాకేజీలో మొత్తం ఏడు మోటార్లను బిగిస్తుండగా, ఐదు పూర్తికాగా, మరో రెండింటిని రానున్న కొద్దిరోజుల్లోనే డ్రైరన్ చేపడతామన్నారు. ఇక్కడ ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎం. రమేశ్, డీఈఈ గోపాలకృష్ణ, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ రమణ, ఏఈఈలు శ్రీనివాస్, సురేశ్, రమేశ్‌నాయక్, వెంకటేష్, ప్రసాద్, మెగా ప్రతినిధులు రామకృష్ణ, సతీశ్ ఉన్నారు.

జంక్షన్ పాయింట్ పనుల పరిశీలన..
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా బుధవారం మండలంలోని శ్రీరాములపల్లి సమీపంలో వరద కాలువ, గ్రావిటీ కెనాల్ జంక్షన్ పాయింట్‌ను కా ళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వేంకటేశ్వర్లు ఈఈ నూనె శ్రీధర్‌తో కలిసి సందర్శించారు. ఈ సంద ర్భంగా జంక్షన్‌పాయింట్, రెగ్యులేటర్‌ను పరిశీ లించారు. అక్కడినుంచి గ్రావిటీ కెనాల్ వెంట ఎనిమిదో ప్యాకేజీ వరకు పరిశీలించుకుంటూ వెళ్లారు. పనుల పురోగతిపై ఈఎన్సీ సంతృప్తి చెందారు. డీఈఈ గోపాలకృష్ణ, ఏఈఈ రమేష్, మెగా ఏజన్సీ ప్రతినిధి సతీష్, ఉన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles