సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు

Thu,March 21, 2019 01:11 AM

కరీంనగర్ క్రైం : ఈ నెల 17న కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై అనుచిత వాఖ్యలు చేస్తూ వీడియోలు తీసి ఓ యువకుడు టిక్ టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కన్నేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు తీసి దేశ సమగ్రతకు భంగం కల్గించడంతో పాటు అంతర్గత భ ద్రతకు విఘాతం కల్గించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన పోలీసులు మత విద్వేషాలు కూ డా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో తీవ్రంగా పరిగణించి కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని విలాసాగరం సాయికుమార్‌గా గుర్తించి అతని కోసం గాలిస్తున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు సీఎం కేసీఆర్‌పై అనుచిత వా ఖ్యలు చేసినందుకు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీ సుకుంటామని సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles