ముగిసిన ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీ

Wed,March 20, 2019 12:52 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ ముగిసిందని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వెనుక భాగంలో గల గోదాంలో ఈవీఎంల ద్వారా చేపట్టిన మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన 2141 బ్యాలెట్, 1671 కంట్రోల్ యూనిట్లు, 1805 వీవీ ప్యాట్లను నాలుగు రోజుల నుంచి తనిఖీ చేశామని తెలిపారు. బీఈఎల్ నుంచి వచ్చిన 43 మంది ఇంజనీర్లు, 150 మంది రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌ల బటన్ల పనితీరు పరిశీలన పూర్తి చేశారన్నారు. పాత డేటాను తొలగించి అప్‌డేట్ చేసి ఎన్నికలకు సిద్ధ్దం చేశామన్నారు. పని చేయని ఈవీఎంలను పక్కన పెట్టి, పని చేసే ఈవీఎంలను మరొక పక్కన పెట్టి వేర్వేరుగా స్టిక్కర్లు అంటించామన్నారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా సరిగ్గా పని చేసే బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లకు ఆకుపచ్చ రంగు, పని చేయని ఈవీఎంలకు ఎరుపు రంగు స్టిక్కర్లు అతికించామని జేసీ తెలిపారు. రిజెక్ట్ అయిన వాటిలో 36 బ్యాలెట్ యూనిట్లు, 59 కంట్రోల్ యూనిట్లు, 157 వివి ప్యాట్లు ఉన్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్దం చేసిన 2105 బ్యాలెట్ యూనిట్లు, 1612 కంట్రోల్ యూ నిట్లు, 1648 వీవీ ప్యాట్లపై మంగళవారం మాక్ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఎన్నికల అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ పవన్‌కుమార్, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకురాలు మాధవి, బీఈఎల్ ఇంజనీర్ నితిన్ ఉన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles