ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందాం

Tue,March 19, 2019 02:28 AM

-హుజూరాబాద్ ఏసీపీ కృపాకర్, బీఎస్‌ఎఫ్ కమాండెంట్ రాజేశ్‌కుమార్
జమ్మికుంట: రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామనీ, జిల్లాలోనే ఆదర్శంగా నిలుద్దామని హుజూరాబాద్ ఏసీపీ కృపాకర్, బీఎస్‌ఎఫ్ కమాండెంట్ రాజేశ్‌కుమార్(డీఎస్పీ) ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం జమ్మికుంటకు బీఎస్‌ఎఫ్ జవాన్లు వచ్చారు. వారికి పట్టణ ప్రజలు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జమ్మికుంట టౌన్, రూరల్ సీఐలు సృజన్‌రెడ్డి, లింగన్నల ఆధ్వర్యంలో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ చౌక్ వరకు కవాతు నిర్వహించారు. తర్వాత బీఎస్‌ఎఫ్ జవాన్లకు ప్రజలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. దేశానికి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. తర్వాత ఏసీపీ, కమాండెంట్‌లు మాట్లాడారు. ఎన్నికల బందోబస్తుకు వచ్చిన జవాన్లను ఆదరిస్తున్న తీరును ప్రశంసించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక్కడ తహసీల్దార్ డాక్టర్ కే నారాయణ, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, హుజూరాబాద్ సీఐ మాధవి, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట ఎస్‌ఐలు నరేశ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది, జవాన్లు, తదితరులున్నారు.

76
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles