గ్రామాల అభివృద్ధికి కృషి

Tue,March 19, 2019 02:20 AM

-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-మిషన్ పనుల్లో జాప్యంపై అధికారులపై ఆగ్రహం
గంగాధర: నియోజకరవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. ఎంపీపీ దూలం బాలగౌడ్ అధ్యక్షతన సోమవారం గంగాధర మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనుల ప్రగతిపై అధికారులతో నాలుగుసార్లు సమీక్ష నిర్వహించినా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ట్యాంకులు కూడా పూర్తి చేయలేదన్నారు. పనులు పూర్తి చేయడంతో అధికారులు, కాంట్రాక్టర్‌కు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం జేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వని పక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను సర్పంచులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు.

రబీలో సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించామన్నారు. రిజర్వాయర్ నుంచి వరదకాలువకు నీటిని విడుదల చేసి కాలువ పరీవాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా చూస్తామన్నారు. ఎల్లంపల్లి నీటి విడుదలలో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కృషి మరువలేనిదన్నారు. ప్రతీ గ్రామంలో ఆరునెలల్లోపు వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు సర్పంచులు కృషి చేయాలన్నారు. అనంతరం నూతన సర్పంచులను ఎమ్మెల్యే సన్మానించారు. సమావేశంలో జడ్పీటీసీ ఆకుల శ్రీలత, కేడీసీసీబీ డైరెక్టర్ వెలిచాల తిర్మల్‌రావు, గంగాధర సింగిల్‌విండో చైర్మన్ వొడ్నాల రాంరెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles