బొమ్మ వెంకన్న ఇకలేరు

Tue,March 19, 2019 02:19 AM

* అనారోగ్యంతో కన్నుమూత
* హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస
* రేపు నగరంలో అంత్యక్రియలు
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇందూర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు (వెంకన్న) (76) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు(76)ది స్వస్థలం కోహెడ మండలం రాంచంద్రపూర్. ఆయన తండ్రి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వెంకన్నకు భార్య కమలమ్మ, ముగ్గురు కూతుళ్లు భారతి, రజనీ, జయశ్రీ, కొడుకు శ్రీరాంచక్రవర్తి ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మంగళవారం తెల్లవారుజాములోపే అశోక్‌నగర్‌లోని తన నివాసగృహానికి మృతదేహాన్ని తీసుకవచ్చారు. బుధవారం మానేరు నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వెంకన్న ఇందూర్తి నియోజకవర్గం నుంచి 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి పీసీసీ స్థాయి వరకు అనేక హోదాల్లో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. జిల్లాలోనూ ప్రముఖ న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. అనేక కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా, న్యాయ సలహాదారుడిగా సేవలందించారు. వేములవాడ దేవస్థానం చైర్మన్‌గా కూడా కొనసాగారు. ప్రస్తుతం లయన్స్‌క్లబ్ కంటి దవాఖాన రేకుర్తి చైర్మన్‌గా, పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా, మున్నూరుకాపు జిల్లా విద్యార్థి వసతిగృహం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

128
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles