పోరుగడ్డ నుంచే పోలికేక

Mon,March 18, 2019 03:13 AM

-కరీంనగర్ వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
-కలిసొచ్చిన గడ్డ నుంచే దిశాదశ
-42నిమిషాలపాటు ప్రసంగం
-కాంగ్రెస్, బీజేపీకి చరమగీతం పాడాలని పిలుపు
-మీరు దీవిస్తే దేశంలో పెనుమార్పులు తీసుకొస్తానని ఉద్ఘాటన
-కరీంనగర్ ఎంపీగా వినోద్‌ను భారీ మెజార్టీతో గెలింపించాలని విజ్ఞప్తి
* తొలి ప్రచార బహిరంగ సభ సక్సెస్
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పోరాటాల పురిటి గడ్డ, తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ వేదికగా ఆదివారం, టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పోలికేక వినిపించారు. నగరశివారులోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి 42నిమిషాలపాటు ప్రసంగించారు. దేశ రాజకీయాల్లో రావాల్సిన మార్పు, అందులో తెలంగాణ పోషించననున్న పాత్రను వివరించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అసమర్థ పాలనవల్లే దేశానికి దుర్గతి పట్టిందని విరుచుకపడ్డారు. మీరు దీవించి పంపితే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తానని ఉద్వేగంగా చెప్పారు. పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే, వందలాది మందిని జమచేసి ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ లక్ష్మీగడ్డ, ఏ పని మొదలు పెట్టినా విజయవంతమవుతుందనీ, అందుకే ఇక్కడ సభ నిర్వహించానని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, పంపాలని పిలుపునిచ్చారు.


* 20ఏళ్ల క్రితం ఇదే గడ్డపై తెలంగాణ తెస్తనని చెప్తే అవహేళన చేసిన్రు. ఈ బక్కనితోని ఎమైతదని అన్నరు. ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లో రోల్‌మోడల్‌గా ఉన్నది. ఐదేళ్ల కింద తెలంగాణ ఎట్లుండె. ఇప్పుడెట్లున్నది.

* టీఆర్‌ఎస్ పెట్టినప్పుడు మకరలో పుట్టి పుబ్బలో పొతుందన్నడు చంద్రబాబు. ఇయ్యాళ తెలంగాణలోకాదు.. ఆంధ్రల సుత నేనే ఓడిస్తనని మూడునెలల నుంచి భయపడుతున్నడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినం మనం.

* పాలన చేయరాదని ఎవరైతే అన్నరో.. వాళ్లకు వెయ్యిరెట్లు పనిచేస్తున్నం. తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దినం. అన్నింటా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపినం. కరెంట్, రోడ్లు, అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దినం.

* గతంలో ప్రాజెక్టులో కట్టాలంటే దశాబ్దాలు పట్టేది. అందుకు ఎల్‌ఎండీనే ఉదాహరణ. ఆ పనులు ఇప్పటికీ పూర్తిగాలె. కానీ మనం నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తిచేస్తున్నం. కారణం ఏంటి? ఒక్కటే చేయాలన్న సంకల్పం. సోయి ఉండాలె అంతే.

* 16 ఎంపీలను గెలిపిస్తే ఏం జేస్తవని కాకరకాయ, గోకరకాయ నేతలు నన్ను అడుగుతున్నరు. వాళ్లను కాదు.. మోదీ.. రాహుల్‌గాంధీలను ఈ వేదిక మీదుగా నేను అడుగుతున్న. గెలిపిస్తే మీరేం జేసిన్రు. ఏమీ లేదు. నాకు 16 మంది ఎంపీలను ఇస్తే 160 మందిని జమజేస్త. సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్త. పెనుమార్పులకు నాంది పలుకుత.

* మోదీ, రాహుల్‌గాంధీ మైకులు పగలకొడుతున్నరు. థూ కిత్తా.. మైకిత్తా అని దుమ్మెత్తిపోసుకుంటున్నరు. పక్క దేశాల ముందు పరువు తీస్తున్నరు. వాళ్లిద్దరి వల్లే ఈ దేశానికి ఈ దుర్గతి. 70ఏళ్లు గడిచినా సాగు, తాగునీరందని దౌర్బాగ్యం. వాళ్లకు తెలివుంటే ఈ పరిస్థితి ఉండేదా? ఇద్దరూ దొంగలే. దద్దన్నలు, మొద్దన్నలు పోవాలె. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలె.

* థూకిత్తా.. మైకిత్తా అని ఇట్ల ఎంతకాలం. ఎవడో ఒకడు పొలికేక పెట్టాలె. మొగోడు పుట్టాలె. అందుకే ఫెడరల్ ఫ్రంట్ రావాలె. కరీంనగర్ లక్ష్మీ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచి పోయినప్పుడు సద్దికట్టి పంపిన్రు. రాష్ర్టాన్ని సాధించిన. అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపిన. మళ్లీ మీముందుకు వచ్చిన. మీరు ఆశీర్వదిస్తే దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తం. అసరమైతే జాతీయపార్టీని స్థాపిస్త.

* మీ ఆశీర్వాదం కోసం వచ్చిన. శిరస్సు వంచి కరీంనగర్ గడ్డకు, మీకు నమస్కరిస్తున్న. వినోద్‌కుమార్ తెలంగాణ ఉద్యమంలో వెన్నుచూపని వీరుడు. దేశం ఆశ్చర్యపోయేలా మెజార్టీ అందించి గెలిపించాలె. అనుకున్నట్లుగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఆయన ఎంపీగా ఉండడు కేంద్ర మంత్రిగా ఉంటడు.
కేసీఆర్ స్పీచ్ సైడ్‌లైట్స్
పెట్టినప్పుడు మకరలో పుట్టి పుబ్బలో పొతుందన్నడు చంద్రబాబు. ఇయ్యాళ తెలంగాణలోకాదు.. ఆంధ్రల సుత నేనే ఓడగతనని మూడునెలల నుంచి భయపడుతున్నడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినం మనం.
రోడ్లు, అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపినం.
ప్రాజెక్టులో కట్టాలంటే దశాబ్దాలు పట్టేది. అందుకు ఎల్‌ఎండీనే ఉదాహరణ. ఆ పనులు ఇప్పటికీ పూర్తిగాలె. కానీ మనం నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తిచేస్తున్నం. కారణం ఏంటి? ఒక్కటే చేయాలన్న సంకల్పం. సోయి ఉండాలె అంతే.

రోజుల్లో కరీంనగర్‌లో స్వీచ్ వేస్తే నాలుగు సజీవ అమృతధారాలు పొంగుతయ్. 180 కిలోమీటర్ల పొడవున్న మానేరు. 124 కిలోమీటర్ల పొడవున్న మూలవాగు. 250 కిలోమీటర్ల పొడవునా గోదావరి ఎప్పుడూ నీళ్లతో నిండే ఉంటయ్. అది మీరే చూస్తరు.
ఎంపీలను గెలిపిస్తే ఏం జేస్తవని కాకరకాయ,. గోకరకాయ నేతలు నన్ను అడుగుతున్నరు. వాళ్లను కాదు.. మోదీ.. రాహుల్‌గాంధీలను ఈ వేదిక మీదుగా నేను అడుగుతున్న. గెలిపిస్తే మీరేం జేసిన్రు. ఏమీ లేదు. నాకు 16 మంది ఎంపీలను ఇస్తే 160 మందిని జమజేస్తా. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తా. పెనుమార్పులకు నాంది పలుకుతా. ఇప్పటికే ఇతర ప్రాంతీయ పార్టీలకు ఏం నూరిపోయ్యాలో అన్ని పోసిన.
రాష్ర్టానికి ఇచ్చిందేమీలేదు. రాజ్యంగా బద్ధంగా ఇవ్వాల్సినవే ఇస్తున్నరు. ఇంకాచెప్పితే పన్నుల రూపంలో దేశానికి తెలంగాణ రూ.50 వేలకోట్లను ఇస్తున్నది. అందులోంచి రాష్ర్టానికి వాపస్ వస్తున్నయ్ 24వేల కోట్లే. ఇపుడు చెప్పండి ఎవడు ఎవనికి ఇస్తున్నడు.

రాహుల్‌గాంధీ మైకులు పగలకొడుతున్నరు. థూ కిత్తా.. మైకిత్తా అని దుమ్మెత్తిపోసుకుంటున్నరు. పక్క దేశాల ముందు పరువు తీస్తున్నరు. వాళ్లిద్దరి వల్లే ఈ దేశానికి ఈ దుర్గతి. 70ఏళ్లు గడిచినా సాగు, తాగునీరందని దౌర్బాగ్యం. వాళ్లకు తెలివుంటే ఈ పరిస్థితి ఉండేదా?
హిందూ.. హిందూత్వం అని మాట్లడుతరు. వాళ్లేనా హిందువులు. మనం కాదా? నేను చేసిన యాగాలు దేశంలో ఎవడూ జేయలే. మీరు కూడా రండి. ఇంత ప్రసాదం పెడతాం.
గాంధీ మాట్లాడుతడు. పీఎం చౌకీదార్ నహీ హే. చోరీ హే అని అంటడు. మోదీ మాట్లడుతడు. మీ తల్లీబిడ్డలిద్దరూ జమానత్ మీద బయట తిరుగుతున్నరు అంటడు. ప్రపంచ దేశాల ముందు మన దేశం ఇజ్జత్‌మానం తీస్తున్నరు.
మైకిత్తా అని ఇట్ల ఎంతకాలం. ఎవడో ఒకడు పొలికేక పెట్టాలె. మొగోడు పెట్టాలె. అందుకే ఫెడరల్ ఫ్రంట్ రావాలె. కరీంనగర్ లక్ష్మీ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచి పోయినప్పుడు సద్దికట్టి పంపిన్రు. రాష్ర్టాన్ని సాధించిన. అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపిన. మళ్లీ మీముందుకు వచ్చిన. మీరు ఆశీర్వదిస్తే దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తం. అసరమైతే జాతీయపార్టీని స్థాపిస్తా.

వరకు చైనా జీడీపీ మనకన్నా తక్కువ. అమెరికాలో మనలో నాలుగోవంతు ఉంటది. మరీ వాళ్లు ఎక్కడున్నరు. మనం ఎక్కడున్నం. ఇంకా ఎంతకాలం ఇనాలె ఈ ముచ్చట్లు. ఆడు బంగారం ఏమైనా తింటున్నరా? అదేం లేదు. చేయాలన్న సోయి ఉండాలె. దేశం బాగుపడాలంటే కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలె. సమాఖ్య ప్రభుత్వాలు నిర్మాణంలోకి రావాలె. పాలనలో పెను మార్పులు తేవాలె.
తలరాతను మార్చేందుకు నేను కృషిచేస్తా. తెలంగాణ చోదకశక్తి గావాలె. దిక్సూచీగా నిలవాలె. మార్పులు కావాలె. అందుకు మీ ఆశీరాదం కావాలె. ఎక్కడో.. ఒక్కడు తెగించాలె. ఆ సమయం ఆసన్నమైంది.
తెలంగాణ ఉద్యమంలో వెన్నుచూపని వీరుడు. దేశం ఆశ్చర్యపోయేలా మెజార్టీ అందించి గెలిపించాలె. అనుకున్నట్లుగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తే ఆయన ఎంపీగా ఉండడు కేంద్ర మంత్రిగా ఉంటడు.

435
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles