చదువుతోనే జీవితానికి సార్థకత

Tue,February 19, 2019 01:25 AM

-సంస్కృతిని కాపాడుకోవాలి
-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర: చదువుతోనే విద్యార్థి జీవితానికి సార్థకత చేకూరుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని న్యాలకొండపల్లి వద్ద గల ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథి గా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇంటర్మీడియట్ దశ విద్యార్థి జీవితాల్లో కీలకదశ అని చెప్పారు. ఉన్నత ఉద్యోగాలు వదిలి ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకున్న సందర్భంగా ప్రిన్సిపాల్ బల్బీర్‌కౌర్‌ను అభినందించారు. పాఠశాలలో వారం రోజుల్లో విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చే యిస్తామని, పాఠశాలలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులకు హెల్త్‌కిట్లను అందజేసారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పాఠశాలకు వచ్చిన ఆయన్ను ఉపాధ్యాయులు సన్మానించారు. కాగా వీడ్కోలు వేడుకల్లో విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమం లో ఎంపీపీ దూలం బాలగౌడ్, సర్పంచ్ రేండ్ల జమున, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, నాయకులు ఉప్పుల గంగాధర, రేండ్ల శ్రీనివాస్, పుల్కం నర్సయ్య, కంకణాల రా జ్‌గోపాల్‌రెడ్డి, కంకణాల రవీందర్‌రెడ్డి, తూం మల్లారెడ్డి, సామంతుల శ్రీనివాస్, మ్యాక వినోద్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles