అభివృద్ధి కనిపించడం లేదా?

Mon,February 18, 2019 12:38 AM

-పొన్నం హయాంలో ఒరింగిదేమీలేదు
-ప్రజలు తిరస్కరించినా పదవుల్లో కొనసాగడమెందుకు?
-కార్పొరేటర్ వై సునీల్‌రావు ధ్వజం
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ పార్లమెం టరీ నియోజకవర్గంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను పొన్నం ప్రభాకర్‌కు కనిపించ డం లేదా అంటూ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ వై సునీల్‌రావు ప్రశ్నించారు. పొన్నం ఎంపీగా ఉన్నపుడు ప్రజలకు ఒరిగిందేంలేదని ధ్వజమెత్తారు.ఆదివా రం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల స మావేశంలో మాటాడారు. కాంగ్రెస్ పాలనలో మూ లనపడ్డ కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే ప్రాజె క్టులను పట్టాలెక్కిందచిన ఘనత ఎంపీ వినోద్‌కే దక్కిందన్నారు. ఈ మార్చి నాటికి గజ్వేల్ వరకు , ఈ ఏడాది చివరి నాటికి సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.200 కో ట్లు కేటాయించారనీ, ఈ ఘనత ఎంపీ వినోద్‌కుమార్ దేనన్నారు. గతంలో చేవెళ్ల, ప్రాణహిత ప్రా జెక్టులో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఒక్క అనుమతి తీసుకురాలేకపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రిడిజైన్ చేసిన అనంతరం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి ప్రాజెక్టును శరవే గంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు. అతి చిన్న నగరంగా ఉన్న కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాను తీ సుకువచ్చిన ఘనత వినోద్‌కే దక్కుతుందన్నారు. కరీంనగర్‌కు అన్ని వైపుల నుంచి జాతీయ రహదారులను అనుసంధానించిన విషయం పొ న్నం కు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. పీవీ హాయంలో శంకుస్థాపన చేసిన పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్‌ను పూర్తి చేయించడంలోనూ, విద్యుదీకరణకు ఎంపీ కృషి చేశారన్నారు. అలాగే కరీంనగర్ నుంచి ముంబాయికి, కాచీగూడకు రై లు తీసుకువచ్చినది పొన్నంకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎక్కడా లేని వి ధంగా క్రీడకారుల కోసం రూ. 7 కోట్లతో అస్టోటర్ఫప్ తీసుకువచ్చిన ఘనత కూడ ఎంపీదేనన్నా రు.

సిరిస్లిలకు కేంద్రీయ విద్యాలయం, బీజీగిరీషరీఫ్, ఉప్పల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 104 కోట్లు మంజూరు చేయించారన్నారు. రాష్ట్ర హైకోర్టు విభజనలోనూ ఎంపీ ఎంతో కృషి చేశారన్నారు. సిరిసిల్లలో కేంద్రీయ విద్యాలయా న్ని ఏర్పాటు చేయించా రన్నారు. అలాగే తీగలగుట్టపల్లి వద్ద కూడ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం, కరీంనగర్‌కు త్రిబుల్ ఐటీ, రాజీవ్ రహదారికి జాతీయ రహదారి హోదా, సైనిక్‌స్కూల్ లాంటి తీసుకువ చ్చేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే కరీంనగర్ నుంచి ఖాజీపేట రైల్వే లైన్‌కు కూడ సర్వే పనులు సాగుతున్నాయన్నారు. పొన్నం ప్రభాకర్‌కు ఇతరులను విమర్శించడం, హేళన చేయడం తప్పా మరేం తెలియదని దెప్పి పొడిచారు. పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు వారి అ న్నకు పదవి ఇప్పించుకోవడం, పార్టీలో గ్రూపు రా జకీయాలు చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. అందుకే ప్రజలు గత ఎంపీ ఎన్నికల్లో ఓడించారనీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే మూడోస్థానానికి పరి మితం చేశారని గుర్తు చేశారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా కాంగ్రెస్ పార్టీ పదవులను పట్టుకొని వెళ్లాడుతున్నారని దు య్యబట్టారు. ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో ఎంపీ మరోసారి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు కన్నం శ్రీనివాస్, దూలం సంపత్ గౌడ్, నరేందర్, అంజన్‌రావు, చంద్రమౌళి, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles