లోక్‌సభ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేస్తాం

Sat,February 16, 2019 01:38 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వచ్చే లోక్ సభ ఎన్నికల సందర్భంగా వినియోగించే ఈవీఎం లను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వెనుక భాగం లో గల గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో తాళం తెరిచారు. మాట్లాడారు. ఇప్పటికే ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలకు ఉపయోగించిన ఈవీఎం యంత్రాల మొదటిస్థా యి తనిఖీ కార్యక్రమం పూర్తయిందన్నారు. కరీంనగర్, హుజురాబాద్‌కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై హైకోర్టు లో కేసులు ఉన్నందున ఆ ఈవీఎంల తనిఖీ చేయలేదన్నారు.

ఈవీఎంలను స్టాంగ్ రూంలో భద్రపరిచామన్నారు. ఈవీఎంల పని తీరును బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్‌ల బటన్ల పనితీరును పరిశీలించడంతో పా టు పాత డేటాను తొలగించి అప్‌డేట్ చేసి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధ్దం చేశామన్నారు. పని చేయని ఈవీఎంలను పక్కన పెట్టి, పని చేసే ఈవీఎంలను మరొక పక్కన పెట్టి వేర్వేరుగా స్టిక్కర్లు అంటించామని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సరిగ్గా పని చేసే బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లకు ఆకుపచ్చ రంగు స్టిక్కర్లు అతికించామని, పని చేయని ఈవీఎంలకు ఎరుపురంగు స్టిక్కర్లను అతికించామని జేసీ తెలిపారు. ఎరుపు రంగు అంటించిన ఈవీఎం యం త్రాలను రిజెక్ట్ అయినట్లుగా భావించి వాటిని పక్కన పెట్టామన్నారు. అలా పక్కన పెట్టిన రిజెక్టెడ్ ఈవీఎం యంత్రాల్లో 7 బ్యాలెట్, 8 కంట్రోల్ యూనిట్లు, 48 వివి ప్యాట్‌లను బీఈఎల్ కంపెనీ బెంగుళూరుకు పంపిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ అధికారి ప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles