లక్ష్మీగణపతి ఆలయంలో ఎమ్మల్యే పూజలు

Sat,February 16, 2019 01:38 AM

గన్నేరువరం: మండలంలోని పారువెల్ల లక్ష్మీగణపతి దేవాలయ అష్టమ వార్షికోత్సవాలు రెండురోజుకు చేరగా, శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావుతో కలిసి హాజరయ్యారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి లక్ష్మీగణపతి చిత్రపటాన్ని అందజేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. వేడుకల్లో ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్దం వేణు, గ్రామ సర్పంచ్ తీగల మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ అల్వాల జ్యోతి, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, నాయకులు జువ్వాడి మన్మోహన్‌రావు, మాడుగుల రవీందర్‌రెడ్డి, అల్వాల కోటి, న్యాత సుధాకర్, బీజీవైఎం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, నాయకులు ధీరజ్, శివశంకర్, అక్షయ్‌ఆలయకమిటీ సభ్యులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles