కూరగాయల సాగుపై అవగాహన

Sat,February 16, 2019 01:38 AM

తిమ్మాపూర్ రూరల్: కూరగాయల సాగుతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని హార్టికల్చర్ ఆఫీసర్ స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని పోరండ్ల గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో కూరగాయల సాగులో ఎరువుల ప్రణాళిక- సామర్థ్యం పెంపు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కూరగాయల సాగు, ఎరువుల వాడకం, సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలువివరించారు. అలాగే పండించిన కూరగాయల నిల్వ, రవాణా గురించి రైతులకు వివరించారు. మండల వ్యవసాయాధికారి జే సురేందర్ ప్రస్తుతం వరి పంటలో చేపట్టాల్సిన పనులను రైతులకు వివరించారు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా తొలి విడతగా అర్హుల జాబితాను గుర్తించడం జరిగింది. కార్యక్రమంలో బీటీఎం సునీల్, ఏఈవోలు పున్నంచందర్, స్వామి, సర్పంచ్ రెడ్డి త్రివేణి, ఎంపీటీసీ బొజ్జ కొమురయ్య, ఆర్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ ఎల్లాల రమణారెడ్డి, ఉపసర్పంచ్ కిన్నెర సతీశ్, రైతులు పాల్గొన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles