జ్యోతిష్మతిలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్

Sat,February 16, 2019 01:37 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ విద్యార్థులకు క్రేన్స్ సాప్ట్‌వేర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బహుళజాతి సంస్థ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. 65 శాతం, ఆపైన ఉత్తీర్ణత శాతం కలిగిన విద్యార్థులు సుమారు 350 మందికి రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఫైనల్ హెచ్‌ఆర్ రౌండ్స్‌ను నిర్వహించి, ఉద్యోగ నియమాక పత్రాలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధి మయాంక్ రంజన్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ.. కళాశాలలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డీన్ ఆకాడమిక్స్ ఎస్‌వీఎస్ రామకృష్ణరాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ జీ లక్ష్మినారాయణరావు, డాక్టర్ పీకే వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారి విశ్వ ప్రకాశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌టౌన్: అనేక ఏళ్ల తరబడి దుమ్ము, రాత్రీపగలనక కష్టపడిన రైస్‌మిల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని రా రైస్‌మిల్ అండ్ పారా బాయిల్డ్ మిల్స్‌లో పని చేస్తున్న ఆపరేటర్స్ అండ్ ఆల్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం మిడిదొడ్డి రమేశ్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక హైస్కూల్ క్రీడామైదానంలో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. కార్మికులకి 8గంటల పని విధానం, పీఎఫ్ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ఏ ఒక్క మిల్లులో కూడా అమలు చేయడం లేదన్నారు. అదనపు పనిగంటలకు ఓటీ చెల్లించకుండా కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నా రైస్‌మిల్ యాజమాన్యాలపై కార్మికశాఖ పీఎఫ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన హక్కులు రాకుండా పోతున్నాయనీ, ఇప్పటికైనా కార్మికశాఖ అధికారులు స్పందించి శ్రమదోపిడీని అరికట్టాలన్నారు. లేనైట్లెతే కార్మికులు నిరవధిక సమ్మె చేయన్నట్లు తెలిపారు. సమావేశంలో రా రైస్‌మిల్ అండ్ పారా బాయిల్డ్ మిల్స్‌లో పని చేస్తున్న ఆపరేటర్స్ అండ్ ఆల్ వర్కర్స్ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి తిరుగమళ్ల నాగార్జున, నాయకులు ప్రతాప శ్రీనివాస్, సారంగపాణి, మేక శ్రీనివాస్, రవి, సంపత్, కుమారసామి, రవీందర్రావు, దిలీప్, సురేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles