ప్రతి రైతుకూ పట్టాదారు పాసు పుస్తకాలు

Wed,February 13, 2019 01:12 AM

-కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
-పాసు బుక్కుల పంపిణీ, భూ రికార్డులపై అధికారులతో సమీక్షా సమావేశం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రతి రైతుకూ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుస్తకాల పంపిణీ, భూ రికార్డులపై రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కోర్టు కేసుల్లేని భూములకు సంబంధించిన పాసు పుస్తకాలను తక్షణమే బాధ్యులకు అం దజేయాలని తహసీల్దార్లకు సూచించారు. పట్టాదారు చనిపోతే వారి వారసుల పేరిట వెంటనే మ్యుటేషన్ చేయాలన్నారు. రైతులు భూములు అ మ్మినా, కొనుగోలు చేసినా అట్టి భూమిని రికార్డు ల్లో నిక్షిప్తం చేయాలన్నారు. జిల్లాలో 51వేల రైతు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేదని, వెంటనే అనుసంధానించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రా మాల్లో భూ సమస్యలపై ఆర్‌ఐ, వీఆర్‌ఓను పం పించి విచారణ జరిపించాలని ఆదేశించారు. సా దా బైనామాల కేసులను వెంటనే పరిష్కరించాలని, భూమిని ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకుని గ్రామంలో విచారించి న్యాయబద్ధ్దం గా తహసీల్దార్లు వెంటనే తుది నిర్ణయం తీసుకుని అర్హులైన రైతులకు భూమిని 1బీలో నమోదు చేసి పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూఖాతాలను ధరణి వైబ్ సైట్ లో మార్క్ చేయాలని సూచించారు.

2018 ఖరీఫ్ పంట కాలానికి జిల్లాకు 1,46,027 రైతుబంధు చెక్కులు వచ్చాయని తెలిపారు. ఇందులో 1,32, 862 చెక్కులను సంబంధిత రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. వివిధ కారణాలచే 13,165 చెక్కులను తిరిగి ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు. జిల్లాలో 2,689 మంది రైతులకు 1బీలో నమోదై పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని, రెండు రోజుల్లో తహసీల్దార్లు పరిశీలించి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీ గా భూ సమస్యల కేసులను తయారు చేయాలని కలెక్టర్ తహాసీల్దార్లను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాలను వెంటనే చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశం లో జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, జి ల్లా రెవెన్యూ అధికారి భిక్షానాయక్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ ఉప సం చాలకులు శ్రీనివాస్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీఓలు ఆనంద్‌కుమార్, చెన్నయ్య పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles