అడవులను రక్షించాలనే ఆలోచన అద్భుతం

Tue,February 12, 2019 12:45 AM

-జిల్లా సామిల్ టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌రావు
-పోలీసుల జోక్యాన్ని స్మగ్లర్ల నియంత్రణకేపరిమితం చేయాలని కలెక్టర్‌కు వినతి
కరీంనగర్ హెల్త్ : తెలంగాణలో అడవులను రక్షించాలనే ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జంగిల్ బచావో-జంగిల్ బడావో కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా సామిల్ టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేచినేని అశోక్‌రావు తెలిపారు. సోమవారం నగరంలో జిల్లా సామిల్ టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తా నుంచి ర్యాలీ తీశారు. తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అటవీ శాఖకు తమ అసోసియేషన్ సహకరిస్తుందన్నారు. అటవీ సంపదతో అక్రమంగా కార్యకలాపాలు చేసే వారి పట్ల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సరైనవేననీ, అడవిలో స్మగ్లింగ్‌ను ప్రోత్సహించే వారిపై చట్టరీత్యా చర్యలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడి సామిల్స్‌లో 80 శాతానికి పైగా ఇతర దేశాల నుంచే కలపను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. తుమ్మ, వేప కర్రలను కూడా ప్రభుత్వ అనుమతితోనే పనులకు వాడుతూ జీవిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన పీడీ చట్టంతో స్మగ్లర్లపై తీసుకునే చర్యలకు తమను బలి చేయవద్దని కోరారు. పోలీసుల జోక్యాన్ని అడవుల్లో స్మగ్లర్ల నియంత్రణకే పరిమితం చేయాలనీ, సామిల్, టింబర్ డిపోలు, కార్పెంటరీ షాపుల్లో జోక్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎలిగేటి లక్ష్మీనారాయణ, సూర శ్రీనివాస్, తిరుపతి, సత్యం, ఎల్లయ్య, రాజ్‌కుమార్, చంద్రకాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

281
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles