ఓటరుగా నమోదు చేసుకోవాలి

Thu,September 13, 2018 01:21 AM

గంగాధర: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ కోరారు. మండల కేంద్రంలో బుధవారం చొప్పదండి నియోకవర్గ స్థాయి లో బీఎల్‌వోలకు ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ హాజరై మాటాడుతూ, ఈ నెల 25 లోపు ఓటరుగా నమోదు, ఆక్షేపణ, చేర్పులు, మా ర్పులు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో బీఎల్‌వోలు ఇంటింటా సర్వే చేస్తూ జాబితాలో పేర్లు లేని వారి వివరాలు నమోదు చేయాలనీ, ఈ నెల 15,16వ తేదీల్లో గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి ఓటరు జాబితాను చదివి వినిపించాలన్నారు. జాబితాలో పేర్లు లేని వారి వివరాలు అక్కడికక్కడే ఫారం-6లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భిక్షు నాయక్, డీఆర్డీఓ పీడీ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్లు సరిత, రాజయ్య, సయ్యద్ ముబిన్ అహ్మద్, ప్రసాద్, నాయబ్ తహసీల్దార్ వైశాలి, ఆర్‌ఐలు కనకరాజు, రహీమ్, వీఆర్వోలు, నియోజకవర్గంలోని ఆరు మండలాల బీఎల్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles