కంటి వెలుగు కార్యక్రమం

Thu,September 13, 2018 12:59 AM

మానకొండూర్: మండల కేంద్రంలోని జేఆర్‌ఎం, గుడ్‌న్యూస్ పాఠశాలల్లో బుధవారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో 230 మంది విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు శిబిరం ఇన్‌చార్జి డాక్టర్ నీలిసాగర్ తెలిపారు. ఆరుగురికి కళ్లద్దాలు, మందులు అందజేశారు. 11 మందికి ప్రత్యేక కళ్లద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఒకరిని కంటి శస్త్ర చికిత్స కోసం కరీంనగర్‌లోని దవాఖానకు రెఫర్ చేశారు. నేత్రవైద్యుడు ప్రభాకర్, సీహెచ్‌ఓ సయ్యద్ అఫ్జల్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రవికుమార్, సూపర్‌వైజర్ రాజు, పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్: కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్, నుస్తులాపూర్ ఎంపీటీసీ గోగూరి నర్సింహారెడ్డి కోరారు. నుస్తులాపూర్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా 185 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి విప్లవశ్రీ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ కొత్త తిరుపతిరెడ్డి, వైద్యుడు జే.సురేశ్, కో-ఆర్డినేటర్ జీవన్‌రావు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
శంకరపట్నం: కరీంపేట్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో 247 మందికి కంటి పరీక్షలు చేసినట్లు ఆప్తాలమిక్ అధికారి గూడూరి రాంరెడ్డి తెలిపారు. 52 మందికి కళ్లద్దాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరో 116 మందికి ప్రత్యేక కళ్లద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు వెల్లడించారు. 28 మందిని శస్త్ర చికిత్స కోసం రేకుర్తి కంటి దవాఖానకు రెఫర్ చేసినట్లు చెప్పారు. శిబిరం ఇన్‌చార్జి సులోకనాథుడు, కో-ఆర్డినేటర్ సంజీవరెడ్డి, ఎస్తేర్ రాణి, ఏఎన్‌ఎం శ్రీవాణి, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

317
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles