గంగులను గెలిపించుకుంటాం

Thu,September 13, 2018 12:58 AM

- రేకుర్తి, బావుపేట, దుర్శేడ్‌లో గ్రామస్తుల ప్రతిజ్ఞ
కొత్తపల్లి/కరీంనగర్‌రూరల్: వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను మళ్లీ గెలిపించుకుంటామని రేకుర్తి, బావుపేట, దుర్శేడ్ గ్రామాల ప్రజలు తీర్మానించుకుని, ప్రతిజ్ఞ చేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మాజీ సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్ ఆధ్వర్యంలో సుమారు నాలుగువందల మంది ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బావుపేటలో మాజీ సర్పంచ్ దావ వాణి కమలమనోహర్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడ్‌లో వెలమ, గౌడ, మాల, మాదిగ, పద్మశాలి, నేతకాని, తెలంగాణ బేడ బుడిగ జంగాలు, మహిళా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి గంగుల కమలాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీలు పెంచాల అంజనేయులు, కోరుకంటి శోభ వేణుమాధవరావు, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, రామోజు తిరుపతి, నలువాల విజయ, పెంచాల ప్రభాకర్, రెడ్డ వేణి మధు, నలువాల సాయికిశోర్, తదితరులు పాల్గొన్నారు.

163
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles