చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

Thu,September 13, 2018 12:58 AM

కరీంనగర్ హెల్త్: కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బుధవారం మృతిచెందారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌కు చెందిన చిదురాల రజిత (38)కు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ దవాఖానా నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తిక్కల సుమలత(24) తన తల్లి గోల్కండ విజయ ఇద్దరూ బస్సు ప్రమాదంలో గాయపడ్డారు. సుమలతకు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్‌లోని చల్మెడ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించి మృత్యువాతపడింది. ఆరు నెలల క్రితం కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన తిక్కల బాబుతో సుమలతకు వివాహం జరగగా, ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. తల్లిగారి ఊరైన డబ్బు తిమ్మయ్యపల్లి నుంచి వేములవాడ దవాఖానాకు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె తల్లిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles