నాడు మా ఊరికి రోడ్డు కూడా లేదు


Wed,September 12, 2018 03:10 AM

కొత్తపల్లి: గత ప్రభుత్వాల హయాంలో తమ ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదని.. అప్పటి పాలకులకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని కొత్తపల్లి మండలం నాగులమల్యాల అనుబంధ గ్రామం కొండాపూర్, ఖాజీపూర్ అనుబంధ గ్రామం ఐలవానిపల్లి వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయా గ్రామాల్లో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ను తిరిగి గెలిపించుకోవాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో నాలుగేళ్లలో ఒక్కో గ్రామానికి సుమారు రూ.20 కోట్ల నిధులు అందాయని తెలిపారు. ముఖ్యంగా నాగులమల్యాల గ్రామంలోని నాగన్న చెరువు నింపేందుకు ఆచంపల్లి నుంచి వరద కాలువ నిర్మాణం చారిత్రాత్మకమని గ్రామస్తులు కొనియాడారు. రానున్న ఎన్నికల్లో గంగుల కమలాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామదేవతల మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్ము హేమలత, అలివేలి మంగ, శేఖర్ రావు, రవికిరణ్, గొర్రె రవి, ఎంపీటీసీ అమిరిశెట్టి రామస్వామి, మెంగాని శ్రీకాంత్, గోదాల రంజిత్, గాజె రాజు, కుంట అంజయ్య, అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...