తుమ్మనపల్లిలో గ్రామ సభ


Wed,September 12, 2018 03:09 AM

హుజూరాబాద్ రూరల్: మండలంలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ జున్నూతుల రేవంత్‌రెడ్డి గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. రైతుల ఫిర్యాదుతో పందుల కాపరులను పిలిపించి మాట్లాడారు. పందులను ఊరికి దూరంగా పెంచుకోవాలని చెప్పారు. వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి జీవన్‌రెడ్డి, ఎంపీటీసీ రాంరెడ్డి, వీఆర్వో రహీం, ఏపీఎం లక్ష్మణ్‌రావు, గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీరాముల ఆగమ్మ, కాశిరెడ్డి చిరంజీవరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గోపగాని సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...