ఐటీఐలో చేరేందుకు చివరి అవకాశం


Wed,September 12, 2018 03:08 AM

జమ్మికుంట: ఐటీఐలో చేరేందుకు చివరి అవకాశంగా ఈ నెల 11నుంచి 17వరకు అధికారులు గడువు విధించారని, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జమ్మికుంట జీఎస్‌ఆర్ ఐటీఐ(ఐటీసీ) కరస్పాండెంట్ ముష్కె వీరరాజు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీఐల్లో ఇప్పటికే విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఆయా గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి తర్వాత ఐటీఐ చేసిన యువత ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణిస్తున్నారని, ఆర్థిక ఎదుగుదలకు ఇది మంచి అవకాశంగా పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు జీఎస్‌ఆర్ ఐటీఐ(ఫోన్ నంబర్ 9290086669)లో సంప్రదించాలని కోరారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...